కోహ్లి కొత్త రికార్డు..

231
- Advertisement -

విరాట్‌ కోహ్లి పరుగుల ప్రవాహంతో పాటు రికార్డుల మోత కూడా కొనసాగుతోంది. తాజాగా అతను మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. మూడు టెస్టుల సిరీస్‌ మూడు మ్యాచ్‌ల్లోనూ సెంచరీలు బాదిన తొలి అంతర్జాతీయ కెప్టెన్‌గా కోహ్లి రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుత శ్రీలంక సిరీస్‌ తొలి మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 104 పరుగులతో అజేయంగా నిలిచిన కోహ్లి.. రెండో టెస్టులో 213 పరుగులు చేశాడు. మూడో టెస్టు తొలి రోజు అతను 156 పరుగులతో అజేయంగా నిలిచాడు.

Virat Kohli Continues to Make Records

1 సొంతగడ్డ దిల్లీలో కోహ్లీకిదే తొలి సెంచరీ. 6 ఈ ఏడాది శ్రీలంకపై కోహ్లి సెంచరీలు. నాలుగు టెస్టుల్లో, రెండు వన్డేల్లో సాధించాడు. ఒక ఏడాదిలో ఒకే జట్టుపై అత్యధిక శతకాలు సాధించిన డెస్మండ్‌ హేన్స్‌ (1984లో ఆస్ట్రేలియాపై), సచిన్‌ (1998లో ఆస్ట్రేలియాపై)లను అతను సమం చేశాడు. 20 టెస్టుల్లో కోహ్లి శతకాల సంఖ్య. అత్యంత వేగంగా 20 సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌లో అతడిది ఐదో స్థానం. బ్రాడ్‌మన్‌ (55 ఇన్నింగ్స్‌లు), గావస్కర్‌ (93), హేడెన్‌ (95), స్టీవ్‌ స్మిత్‌ (99) అతడి కంటే ముందున్నారు. కోహ్లి అరంగేట్రం తర్వాత టెస్టుల్లో అతడి కంటే ఎక్కువ సెంచరీలు చేసింది స్టీవ్‌ స్మిత్‌ (21) మాత్రమే.

110 కోహ్లి సెంచరీ కోసం ఆడిన బంతులు. టెస్టుల్లో అతడికిదే వేగవంతమైన శతకం. ఇదే సిరీస్‌ తొలి టెస్టులో అతను 119 బంతుల్లో సెంచరీ చేశాడు. దాన్ని ఇప్పుడు అధిగమించాడు. 283 కోహ్లి, విజయ్‌ల మూడో వికెట్‌ భాగస్వామ్యం. శ్రీలంకపై ఏ వికెట్‌కైనా భారత్‌కు ఇదే అత్యుత్తమం. అజహర్‌-కపిల్‌ పేరిట ఉన్న 272 పరుగుల రికార్డు (1986-87లో ఆరో వికెట్‌కు) బద్దలైంది. సచిన్‌ తర్వాత అత్యంత పిన్న వయసులో 5 వేల మైలురాయిని అందుకున్న భారత బ్యాట్స్‌మన్‌ కోహ్లీనే. సచిన్‌ 25 ఏళ్లకు ఈ ఘనత సాధించగా.. కోహ్లీకిప్పుడు 29 ఏళ్లు. ప్రపంచ క్రికెట్లో ఒకే సీజన్లో అత్యధిక శతకాలు సాధించిన బ్యాట్స్‌మెన్‌లో కోహ్లి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ సీజన్లో కోహ్లీకిది 11వ శతకం. సచిన్‌ (12) అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లి తన చివరి ఆరు 50+ స్కోర్లను శతకాలుగా మలిచాడు.

- Advertisement -