టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈరోజు తన 30వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. కోహ్లీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని రకాల ఫార్మాట్లలో రాణిస్తూ, ఒక్కో రికార్డునూ బద్దలుకొడుతూ సాగుతున్న కోహ్లీకి, ఆయన భార్య, నటి అనుష్క శర్మ కూడా ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. ఈ సందర్భంగా అనుష్క శర్మ విరాట్‌తో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు. ‘అతన్ని పుట్టించినందుకు ధన్యవాదాలు దేవుడా’ అని అనుష్క ట్వీట్ చేశారు.
పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం సాయంత్రం విరాట్, అనుష్క కలిసి విహారయాత్రకు బయలుదేరారు. గతంలో అనుష్క బర్త్‌డేను పురస్కరించుకుని విరాట్ రకరకాల కేక్స్ తెప్పించి ఘనంగా తన భార్య పుట్టినరోజు వేడుకలను జరిపారు. ఇప్పుడు అనుష్క కూడా తన భర్త కోసం సర్‌ప్రైజ్ పార్టీని ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. వివిఎస్ లక్ష్మణ్,సెహ్వాగ్,బిసిసిఐ లతోపాటు పలువురు కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
Thank God for his birth pic.twitter.com/SzeodVBzum
— Anushka Sharma (@AnushkaSharma) November 5, 2018