పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చాడు విరాట్ కోహ్లీ. 111 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ పలు రికార్డులు బ్రేక్ చేశాడు. ఐసీసీ ఈవెంట్లలో ఒకే జట్టుపై అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
పాక్ పై 5 సార్లు కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్నాడు. మరే ఆటగాడు కూడా ఒకే జట్టుపై మూడు లేదా అంతకంటే ఎక్కువ అవార్డులు సాధించకపోవడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో వ్యక్తిగత స్కోరు 15 పరుగుల వద్ద కోహ్లీ వన్డేల్లో 14 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 14 000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. కోహ్లీ కంటే ముందు సంగక్కర, సచిన్ ఉన్నారు. పాక్ పై తాజా సెంచరీ విరాట్ కోహ్లీకి వన్డేల్లో 51వ శతకం. కాగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో(మూడు ఫార్మాట్లలో కలిపి) 82వ సెంచరీ కావడం గమనార్హం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీకి ఇది తొలి సెంచరీ.
Also Read:ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెబుతారు?: కేటీఆర్