ధోనీ రికార్టు బ్రేక్‌ చేసిన కోహ్లీ..!

539
Virat Kohli
- Advertisement -

విండీస్‌తో జ‌రిగిన రెండో టెస్ట్‌లో భారత్ 257 పరుగుల భారీ తేడాతో ఘ‌న విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో 2-0తో భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. తద్వారా కరేబియన్‌ దీవుల్లో తొలిసారి టెస్ట్‌ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఘనతను సాధించింది. ఈ మ్యాచ్‌తో టెస్టుల్లో భారత జట్టుకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరిట ఉంది. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించడంతో ఈ రికార్డు కోహ్లీ సొంతమైంది. గత మ్యాచ్ ద్వారా గంగూలీ రికార్డు ఆసియా అవతల అత్యధిక విజయాల రికార్డును తుడిచేసిన కోహ్లీ.. ఈ మ్యాచ్‌తో ధోనీ రికార్డు బద్దలు కొట్టాడు.

Virat Kohli

సుదీర్ఘ కెరీర్‌లో మహేంద్రసింగ్ ధోనీ 60 టెస్టులకి కెప్టెన్సీ వహించగా.. ఇందులో 27 మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్ జట్టు.. 18 టెస్టుల్లో ఓడి, 15 మ్యాచ్‌లను డ్రాగా ముగించింది. ఇక విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 48 టెస్టులాడిన టీమిండియా.. 28 విజయాలు, 10 ఓటముల, 10 డ్రాలతో నిలిచింది. మొత్తంగా.. ధోనీ కెప్టెన్సీలో భారత్ 45% విజయాల్ని నమోదు చేయగా.. కోహ్లీ నాయకత్వంలో 58.33% టెస్టుల్లో గెలుపొందడం విశేషం.

కాగా, టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా సౌతాఫ్రికా కెప్టెన్ గ్రేమ్‌స్మిత్(109 మ్యాచ్‌ల్లో 53 విజయాలు)తొలి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 48 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు. స్టీవ్ వా(33) విజయాలతో మూడో స్థానంలో ఉండగా, నాలుగో స్థానంలో కోహ్లీ నిలిచాడు.

Kohli-Dhoni

టెస్టుల్లో భారత్‌కి ఎక్కువ విజయాల్ని అందించిన కెప్టెన్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే.. విరాట్ కోహ్లి (28), మహేంద్రసింగ్ ధోని (27) ధోనీ తర్వాత వరుసగా సౌరవ్ గంగూలీ (21), మహ్మద్ అజహరుద్దీన్ (14), పటౌడి (7), సునీల్ గవాస్కర్ (9) టాప్-6లో కొనసాగుతున్నారు. 2014 ఆఖర్లో మహేంద్రసింగ్ ధోనీ నుంచి టెస్టు పగ్గాలను విరాట్ కోహ్లీ అందుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -