భారత్ టార్గెట్ …441

206
Virat Kohli and Co need 441 to win
- Advertisement -

పూణే వేదికగా భారత్‌తో  జరుగుతున్న తొలిటెస్టులో ఆస్ట్రేలియా పట్టుబిగించింది. భారత్ ముందు 441 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.  ఓవర్ నైట్ స్కోరు 143/4తో ఆట ప్రారంభించిన ఆసీస్ 285 పరుగులకు ఆలౌటైంది. బౌన్సీ పిచ్ పై ఎన్నో అంచనాలతో బౌలింగ్ కు దిగిన భారత జట్టు అంచనాల మేరకు రాణించలేకపోయింది. బౌలింగ్, బ్యాటింగ్ లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. దీనికి తోడు టీమిండియా ఫీల్డింగ్ లోపాలు, జారవిడిచిన క్యాచ్ లు జట్టుకు భారంగా మారాయి.

రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌(109 పరుగులు) అద్భుత శతకంతో భారత్‌ ఎదుట భారీ లక్ష్యం నిర్దేశించడంలో కీలకపాత్ర పోషించాడు. స్మిత్‌తోపాటు, రెన్‌షా (31), మిచెల్‌ మార్ష్‌(31), వేడ్‌ (20), స్టార్క్‌(30), హ్యాండ్‌స్కోబ్‌(19), లియోన్‌ (13), ఓకీఫె (6) పరుగులు చేశారు. భారత్‌ బౌలర్లలో అశ్విన్‌ 4 వికెట్లు, జడేజా 3, ఉమేశ్‌ యాదవ్‌ 2, జయంత్‌ ఒక వికెట్‌ తీసుకున్నారు. ఇంకా రెండు రోజులపాటు ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో భారత్‌ బ్యాట్స్‌మెన్‌ తీవ్ర పోరాటం చేయకతప్పదు.

ఇంకా రెండున్నర రోజుల ఆటమిగిలి ఉండగా టీమిండియా ఆటగాళ్లు పుంజుకుని అద్భుతమైన రీతిలో రాణిస్తే తప్ప గెలుపు సాధ్యం కాదు.  తొలి ఇన్నింగ్స్‌లో భారత్105 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే.

- Advertisement -