గురువారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన సూపర్-4 ఆఖరి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా అదరగొట్టింది. భారత్ విధించిన 213 పరుగుల లక్ష్యచేధనలో ఆప్ఘన్ 8 వికెట్లు కొల్పోయి 111 పరుగులు మాత్రమే చేసింది. ఇబ్రహీం జద్రాన్(64 నాటౌట్) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. దీంతో అఫ్గన్‌పై 101 పరుగుల తేడాతో గెలుపొందింది. భువనేశ్వర్ కుమార్(4-1-4-5) విజృంభణతో విజయదుందుభి మోగించింది.
అంతకముందు బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు సాధించింది. స్టార్ బ్యాటర్ కోహ్లీ(61 బంతుల్లో 122 నాటౌట్, 12ఫోర్లు, 6సిక్స్‌లు) అజేయ సెంచరీకి తోడు కేఎల్ రాహుల్(62) అర్ధసెంచరీతో నిర్ణీత ఓవర్లలో భారత్ 212/2 స్కోరు చేసింది. ఫరీద్ అహ్మద్(2/57) రెండు వికెట్లు తీశాడు.
నిజాయితీగా చెప్పాలనుకుంటున్నాను..నా ఇన్నింగ్స్ చూసి నాకే నేను ఆశ్చర్యపోయాను అని తెలిపారు విరాట్. ఆరవై పరుగులు చేసిన సందర్భాలు కూడా నా వైఫల్యంగా లెక్కకట్టడం ఒక రకంగా షాక్‌కు గురిచేసిందన్నారు. ఈ సెంచరీని అనుష్కతో పాటు వామికాకు అంకితమిస్తున్నాను అని చెప్పారు.