తల్లిదండ్రులు కాబోతున్న విరుష్క..?

321
- Advertisement -

భారత జట్లు సారథి విరాట్ కోహ్లీ – బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మలు గత సంవత్సరం పెళ్లితో ఒక్కటైన సంగతి తెల్సిందే. అయితే వీరిద్దరి గురించి తాజాగా ఒక కథనం సోషల్ మీడియాలో వైరల్ మారింది. వీరిద్దరు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు అనే ఆ వార్త దేశ వ్యాప్తంగా హల్‌చల్‌ చేస్తోంది.

Anushka Sharma

అయితే మామూలుగా సెలబ్రెటిలు పెళ్లి చేసుకున్న పిల్లలు కోసం కొంత గ్యాప్‌ తీసుకుంటారు. కానీ విరుష్కాలు మాత్రం తోందరగానే ఉన్నట్లు తెలుస్తుంది.. విరాట్ కోహ్లీకి పిల్లలు అంటే చాలా ఇష్టమట. అందుకే పిల్లల కోసం ఆలస్యం చేయకుండా ఈ స్టార్ కపుల్ వెంటనే తల్లిదండ్రులు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ వార్త వైరల్‌ కావడానికి కారణం.. తాజాగా అనుష్కకు సంబంధించిన ఒక పిక్‌ నెట్లింట్లో దర్శనమిచ్చింది. ఆ పిక్‌లో అనుష్క గర్బవతి ఉన్నట్లు కనిపించంతో అనుష్క తల్లి కాబోతుందేమో అంటూ నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాదు బాలీవుడ్ వర్గాలు కూడా ఈ వార్త కొంతవరకు నిజమే అన్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ఈ విషయమై అనుష్క నుండి కాని విరాట్ నుండి కాని ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్త ఏ మేరకు నిజమో తెలియాలంటే విరుష్కలు స్పందించాల్సివుంది.

- Advertisement -