- Advertisement -
హ్యాపీడేస్ ఫేం వరుణ్ సందేశ్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం విరాజి. మహా మూవీస్ తో కలిసి M3 మీడియా బ్యానర్ పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తుండగా ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు.
సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా టీజర్‌ని రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే ఇదేదో హారర్ థ్రిల్లర్ సినిమాలా కనిపిస్తుండగా వరుణ్ కొత్త లుక్‌లో కనిపించాడు. ఆగస్టు 2న సినిమా తెరకెక్కుతుండగా రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, ప్రసాద్ బెహరా కీలకపాత్ర పోషించారు.
ఈ సందర్భంగా దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ…టీజర్ అద్భుతంగా వచ్చిందని..విజువల్స్ బాగున్నాయని చెప్పారు. వరుణ్ సందేశ్ లుక్ అదిరిపోయిందని…ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందన్నారు.
- Advertisement -