మైత్రి మూవీస్.. ‘విరాజి’

15
- Advertisement -

మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా బ్యానర్ పై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం “విరాజి”. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారు వీక్షించి ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధం అయ్యారు.

నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ “మా విరాజి చిత్రానికి ఇటీవలే సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. తర్వాత మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారు మా చిత్రాన్ని విక్షించి వారి బ్యానర్ ద్వారా మా విరాజి చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధం అయ్యారు. ఇటీవలే విడుదల అయిన టీజర్ కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రం వరుణ్ సందేశ్ కెరీర్ లో పెద్ద విజయం సాధిస్తుంది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. వరుణ్ సందేశ్ చాలా కొత్తగా ఉంటాడు. ఆగస్టు 2 న ప్రపంచవ్యాప్తంగా మైత్రి మూవీస్ సంస్థ ద్వారా విడుదల చేస్తున్నాం” అని తెలిపారు.

Also Read:అప్పుడు రకుల్..ఇప్పుడు ఆమె తమ్ముడు!

- Advertisement -