రివ్యూ: విరాజి

30
- Advertisement -

వరుణ్ సందేశ్‌ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ విరాజి. మహా మూవీస్ , ఎమ్ 3 మీడియా పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించగా ఇవాళ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. ప్రమోషన్ కార్యక్రమాల్లోనే వైవిధ్యాన్ని కనబర్చి సినిమాపై ఆసక్తిని పెంచేయగా ఈ మూవీతో వరుణ్ సందేశ్ హిట్ కొట్టాడా లేదా చూద్దాం..

కథ:

ఓ పిచ్చాసుపత్రి నేపథ్యంలో సాగే కథే విరాజి. వివిధ కారణాలతో మోసపోయి కొంతమంది ఓ పాడుబడ్డ బంగ్లాలోకి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత ఈవెంట్‌ పేరుతో తమను పాడుబడిన పిచ్చి ఆసుపత్రికి వచ్చేలా చేశారని తెలుసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయేందుకు ప్రయత్నిస్తారు.ఈ క్రమంలో ఇద్దరు హత్యకు గురవుతారు. దీంతో మిగిలన వారంతో భయపడి ఆ పిచ్చి ఆస్పత్రిలోనే ఉంటారు. ఈ టైంలో అక్కడికి వస్తాడు హీరో ఆండి(వరుణ్ సందేశ్‌). ఆ తర్వాత ఏం జరుగుతుంది, అసలు వీరిని ఆ పిచ్చాసుపత్రికి వచ్చేలా చేసింది ఎవరు?, చివరకు అక్కడి నుండి ఎలా బయటపడ్డారు అన్నదే విరాజి సినిమా కథ.

ప్లస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ సస్పెన్స్, ఇంటర్వెల్ సీన్, సెకండాఫ్, ఊహించని ట్విస్ట్‌లు, క్లైమాక్స్ సీన్. ఆండీ పాత్రలో వరుణ్ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వరుణ్ సందేశ్ తో నటన సినిమా హైలైట్. నటి కుషాలిని, సిఐ మురళిగా బలగం జయరాం ,సెలబ్రిటీ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణగా
రఘు కారు, ప్రమోదిని, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు. ఇక సినిమా నిడివి తక్కువ ఉండడం మరో ప్లస్ పాయింట్.

Also Read:విరాజిలో చాలా ట్విస్ట్‌లు: వరుణ్ సందేశ్

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా బాగుంది. ఎబెనైజర్ పాల్ నేపథ్య సంగీతం. , బిజిఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ ,ఎడిటింగ్ బాగుంది. బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు నిర్మాత.

తీర్పు:

సస్పెన్స్ థ్రిల్లర్ కథకు ఆసక్తికర కథనం, చివరి వరకు ట్విస్ట్‌లతో ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించాడు దర్శకుడు ఆద్యంత్ హర్ష. వేర్వేరు నేపథ్యం ఉన్న వ్యక్తులు ఒకే చోటికి రావడం, వీరిందరిని రప్పించింది ఎవరు అన్న ఇంట్రెస్ట్‌ను ప్రేక్షకుల్లో కలిగించి ఇంప్రెస్ చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ మధ్యలో కామెడీని పండించాడు. ఇక ఇంటర్వెల్ సీన్ అదిరిపోగా సెకండాఫ్ బాగుంది. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో ప్రేక్షకులు చూడదగ్గ చిత్రం విరాజీ.

విడుదల తేదీ: 02/08/2024
రేటింగ్: 3.5/5
నటీనటులు: వరుణ్ సందేశ్, కుషాలినీ
సంగీతం:ఎబెనైజర్ పాల్
నిర్మాత:మహేంద్ర నాథ్ కూండ్ల
దర్శకత్వం:ఆద్యంత్ హర్ష

- Advertisement -