మహిళా చైతన్యానికి ప్రతీక… రాణి రుద్రమదేవి

228
viond kumar
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం సిద్దించాకే చారిత్రక కట్టడాల పరిరక్షణకు పెద్ద పీట వేశామని తెలిపారు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్.ఎంసీఆర్.హెచ్ఆర్డీలో ” హెరిటేజ్ తెలంగాణ ” ,” జనగణ మన తెలంగాణ ” పుస్తకాలను ఆవిష్కరించారు వినోద్ కుమార్.ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాతే చారిత్రక కట్టడాల పరిరక్షణకు కృషి జరుగుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

శనివారం ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డీ. లో రుద్రమ హాల్ లో ” హెరిటేజ్ తెలంగాణ “, ” జనగణ మన తెలంగాణ ” పుస్తకాలను వినోద్ కుమార్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ వీర గడ్డలో పాలించిన కాకతీయ చారిత్రక కట్టడాలతోపాటు ఇతర చారిత్రక నేపథ్యం ఉన్న కట్టడాల సంరక్షణ ప్రభుత్వ బాధ్యత అన్నారు.

రామప్ప కట్టడాలకు యునెస్కో గుర్తింపు కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసిన విషయాన్ని వినోద్ కుమార్ గుర్తు చేశారు.కరీంనగర్ జిల్లాలోని నంగునూరు, కొత్తపల్లిలలోని కాకతీయుల నాటి పురాతన దేవాలయాల పునరుద్ధరణ కోసం కృషి జరుగుతోందని వినోద్ కుమార్ తెలిపారు.

భారత దేశం చరిత్రలోనే కాకతీయుల సామ్రాజ్యంలో మొదటి రాణీగా రుద్రమదేవి బాధ్యతలు నిర్వహించి ఖ్యాతిని గడించారని వినోద్ కుమార్ తెలిపారు.రుద్రమదేవి స్పూర్తితో తెలంగాణ ప్రాంతం మహిళా చైతన్యానికి కేంద్ర బిందువుగా మారిందని అన్నారు.ఈ కార్యక్రమంలో హెచ్.ఆర్.డీ డైరెక్టర్ జనరల్ బీ.పీ. ఆచార్య, కాకతీయ హెరిటేజ్ ట్రస్టీ లు పాపారావు, ప్రొ. పాండురంగారావు, గోపాలకృష్ణ, ఇంటాక్ అధ్యక్షులు అనురాధ , గౌతమ్ పింగ్లే, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -