రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి రెండోదశ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో 16 స్ధానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే కేసీఆర్ మనకు మరో 150 మంది ఎంపీలు తోడయ్యే అవకాశం ఉందన్నారు.ఏపీలో జగన్‌మోహన్ రెడ్డి, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఒడిశాలో నవీన్ పట్నాయక్, ఉత్తప్రదేశ్‌లో మాయావతి, అఖిలేష్‌యాదవ్ చాలా మంది మనవెంటే ఉంటారన్నారు.
కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం..బీజేపీ గెలిస్తే మోడీకి లాభం..టీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణకు లాభం అన్నారు. వినోద్ కుమార్‌ను గెలిపిస్తే కాళేశ్వరానికి జాతీయహోదా తీసుకొస్తామని తెలిపారు. రూ. 80 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని .. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు మోడీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
ఇద్దరు ఎంపీలతో రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్… 16 మంది ఎంపీలతో ముఖ్యమంత్రి ఏం చేస్తారో అంచనా వేయాలన్నారు. సారు-కారు-పదహారు-ఢిల్లీలో సర్కార్ ఇదే అందరి నినాదం కావాలని పిలుపునిచ్చారు. ఈ దేశానికి కావాల్సింది చౌకీదార్లు, టేకేదార్లు కాదన్నారు. జిమ్మేదారు మనిషి కావాలన్నారు. ఢిల్లీని శాసించే శక్తిగా టీఆర్ఎస్ మారాలని ఆకాంక్షించారు.
TRS Party Working President Sri @KTRTRS along with Karimnagar MP candidate Sri @vinodboianpalli participated in a public meeting in Mustabad, Sircilla, Karimnagar Parliament Constituency.#TelanganaWithKCR#VoteForCar #LokSabhaElections2019#MissionTRS16 pic.twitter.com/Es4nLz3exg
— TRS Party (@trspartyonline) March 27, 2019