- Advertisement -
కేసీఆర్ ఆమరణ దీక్షతో, ప్రజల మద్దతుతో అనుకున్న తెలంగాణ రాష్ట్ర లక్ష్యం సాకారమైందన్నారు ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్. టీఆర్ఎస్ ఆవిర్భవించి నేటితో 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాట్లాడిన వినోద్ కుమార్… బడుగు, బలహీన వర్గాల ప్రజలకు, రాష్ట్ర ప్రగతికి గులాబీ జెండా అండగా నిలుస్తుందన్నారు.
తెలంగాణ స్వరాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్ఎస్.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏడేళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో దేశంలోనే అగ్రభాగాన నిలిపారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.
- Advertisement -