పంచాయతీ రాజ్ సంస్థల బలోపేతానికి కృషి: వినోద్

572
trs vinod
- Advertisement -

పంచాయతీ రాజ్ సంస్థల బలోపేతానికి సీఎం కేసీఆర్‌ ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌. తెలంగాణ ఆర్థిక కమిషన్ చైర్మన్ రాజేశం గౌడ్  అధ్యక్షతన ఖైరతాబాద్ లోని ఇన్‌స్టిట్యూట్ అఫ్ ఇంజనీర్స్ లో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులతో ఆర్థిక మరియు పరిపాలన అంశాలపై సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వినోద్‌..నూతన పంచాయతీ రాజ్ చట్టం తేవడం చాల హర్షించదగిన విషయమని తెలిపారు. వారి కారణంగానే గతంలో ఉన్న 9 జిల్లా ప్రజా పరిషత్తులకు బదులుగా 32 జిల్లా ప్రజా పరిషత్తులు , 438 మండల ప్రజా పరిషత్తులకు బదులుగా 539 మండల ప్రజా పరిషత్తులు మరియు 8368 గ్రామ పంచయతీలకు బదులుగా 12753 గ్రామ పంచయతీలుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

దీనివల్ల గ్రామీణ ప్రజలకు ఎంతో సౌలభ్యం చెకూరడమే కాక పరిపాలన పరంగా కూడా ఎంతో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.ఈ సమావేశంలో రాష్ట్రం లోని ఆయా మండల ప్రజా పరిషత్తు అధ్యక్షులు వారి వారి అనుభవాలు వారు ఎదురుకుంటున్న పరిపాలన మరియు ఆర్థిక విషయాలపై వారి అభిప్రాయములు వెలిబుచ్చారు.

రాజ్యాంగం లోని 73 వ అధికరణం క్రింద గతంలో పంచాయతీ రాజ్ క్రిందగల 29 విషయంలను తిరిగి పంచాయతీ రాజ్ క్రిందకు తీసుకొచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి కోరినాడు. ఉదా: విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి ఎన్నో శాఖలు మరియు మండలాల ఆర్థిక స్థితిని పెంపొందించుటకు తలసి గ్రాంటు, సీనరేజ్, భూమి బదలాయింపు రుసుము మొదలగు వాటి వాత పెంచుటకు మరియు సకాలంలో మండల ప్రజా పరిషత్తులకు సర్దుబాటు చేయుట కోరినారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కమీషన్ చైర్మన్ గారు వీటనింట్లపై ప్రభుత్వము దృష్టికి తీసుకెళతానని ఆయ మండలములు పరిపాలన మరియు ఆర్థిక వ్యవహారములపై నివేదికలు పంపినచో వాటన్నిటిని క్రోడీకరించి అట్టి నివేదికను ప్రభుత్వమునకు సమర్పించటంలో సహకరించాలని తెలిపారు.

- Advertisement -