రేవంత్ ప్రభుత్వం ఆరో మాసం లోకి ప్రవేశించింది.. ఎవరికైనా గ్రేడింగ్ ఇవ్వాలంటే మొదటి ఆరు నెలలు ముఖ్యమైనవి….రేవంత్ రెడ్డి ఈ ఆరు నెలల్లో తన ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం అని చెప్పుకోవడానికి ఏమీ లేదు అని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత, వినోద్ కుమార్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన వినోద్…నేటి కేబినెట్ సమావేశం లో మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అన్నారు. రైతు బంధు దేశం లోనే మొదటి సారి అమలు చేసిన ఘనత కేసీఆర్ ది అన్నారు.
పీఎం సహా అనేక రాష్ట్రాల సీఎం లు రైతు బంధును ప్రశంసించారు ..ఇదే అనేక రైతు పెట్టుబడి సాయం పథకాలకు స్ఫూర్తి అన్నారు. రైతుబంధు అనేది కాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ ….రోహిణీ కార్తె లో తొలకరి జల్లులు వస్తాయి ….సగటు రైతు పెట్టుబడి కోసం రోహిణి కార్తె లో తిరుగుతూ ఉంటారు….రైతుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కేసీఆర్ రైతు బంధు పథకం తెచ్చారన్నారు.
దున్నెటపుడే రైతుకు పెట్టుబడి సాయం వస్తే ఉపశమనం గా ఉంటుంది….రేవంత్ యాసంగి రైతు బంధు పంటలు కోసే సమయానికి ఇచ్చారన్నారు. ఈ సారి అలాంటి తప్పు చేయకుండా రైతు భరోసా ను రోహిణి కార్తె లో విడుదల చేసేలా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవాలన్నారు. జూన్ మొదటి వారం లోనే రైతులకు ఎకరాకు 7500 రూపాయలు విడుదల చేయాలి ..ఆ దిశగా కేబినెట్ లో నిర్ణయించాలన్నారు. వర్షా కాలం లోనే ఎక్కువగా సన్న రకాల ధాన్యం పండిస్తారు….రబీ లో నూకల శాతం ఎక్కువగా ఉంటుందని రైతులు సన్న రకాలు సాగు చేయరన్నారు. రేవంత్ కు ఇదే కీలకమైన కేబినెట్ సమావేశం ..మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నారు వినోద్ కుమార్.
Also read:మాజీమంత్రి మల్లారెడ్డి అరెస్ట్