నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన వినోద్… దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష లీకేజీపై చర్చ జరుగుతుందన్నారు.
బీహార్, గుజరాత్ రాష్ట్రాల నుంచి నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందనే వార్తలు వస్తున్నాయని దీనిపై ఈడీ కేసు ఎందుకు నమోదు చేయడం లేదన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని దీనిపై విచారణ జరపాల్సిందేనన్నారు.
2015 నుండి మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు నీటు పరీక్ష రాస్తున్నారని…నీట్ పరీక్షలో సీటు వచ్చిన వేరే రాష్ట్రాలకు మన పిల్లలు పోవడం లేదు అన్నారు. నీట్ పరీక్షపై మన పిల్లలకు లాభం జరుగుతుందా..? నష్టం జరుగుతుందా..? ఈ విషయంలో స్పష్టత కోసం ఎక్స్‌పర్ట్ కమిటీ వెయ్యాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
Also Read:రాజ్ భవన్‌ను ముట్టడించిన BRSV