క‌రోనాను తుద ముట్టించేవ‌ర‌కు విశ్ర‌మించం: వినోద్ కుమార్

276
vinod kumar
- Advertisement -

కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి స్ఫూర్తినిస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

అందుకు వైద్యులు, మెడికల్, పారిశుద్ధ్య సిబ్బంది, మీడియా, పోలీసు, అన్ని ఉద్యోగ శ్రేణులు, కార్మిక, కర్షక వర్గాలు, ప్రజలు కలిసికట్టుగా, కంకణబద్ధులై ముందుకు సాగుతున్నారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

అన్ని వర్గాలు, ప్రజల ఐక్యత చూస్తుంటే శల్యూట్ తెలంగాణ అని నోరారా చెప్పకుండా ఉండలేకున్నానని వినోద్ కుమార్ తెలిపారు. కరోనా వైరస్ ను తుదముట్టించే దాకా ఎవరూ విశ్రమించకూడదని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.

కరోనా వైరస్ పట్ల ఇప్పటి వరకు అమలు చేస్తున్న చర్యలు సరిపోవని, ఇంకా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు.

కరోనా వైరస్ మహమ్మారి దరి చేరకుండా ఎవరికి వారు వ్యక్తిగత క్రమశిక్షణను పాటించడం అత్యంత ముఖ్యమైన అంశమని వినోద్ కుమార్ అన్నారు.

పొరపాటున కూడా ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కఠినతర స్వీయ నియంత్రణే మానవాళికి శ్రీరామ రక్ష అనే వాస్తవాన్ని ఎవరూ విస్మరించవద్దని వినోద్ కుమార్ గుర్తు చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సీఎం కేసీఆర్ తీసుకుంటున్న ముందస్తు చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని వినోద్ కుమార్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అందుకు అన్ని వర్గాలు అండగా నిలవడం హర్షణీయమన్నారు.

ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ.. కరోనా వైరస్ పట్ల అత్యంత జాగరుకతతో ఉండాలని, కరోనా వైరస్ అంతం చూసే దాకా ఎవరూ విశ్రమించకూడదని బోయినపల్లి వినోద్ కుమార్ ప్రతి ఒక్కరికీ పిలుపునిచ్చారు.

- Advertisement -