ఐపీఎల్ 2026 సీజన్ సందర్భంగా ముంబైలోని వాంఖడే స్టేడియం ఒక భావోద్వేగ సన్నివేశానికి వేదికైంది. భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలో కనిపించడంతో క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అనారోగ్య సమస్యలు మరియు ఇతర వ్యక్తిగత కారణాల వల్ల గత కొంతకాలంగా వార్తల్లో నిలిచిన వినోద్ కాంబ్లీ, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ను వీక్షించేందుకు వాంఖడేకు వచ్చారు. మైదానంలో ఆయన చిరునవ్వుతో కనిపిస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సచిన్ కోసం: కాంబ్లీని మైదానంలో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తన చిన్ననాటి స్నేహితుడు సచిన్ టెండూల్కర్ మెంటార్‌గా ఉన్న ముంబై ఇండియన్స్ (MI) జట్టుకు మద్దతు తెలిపేందుకే ఆయన వచ్చారని ఇంటర్నెట్ కోడై కూస్తోంది.సచిన్, కాంబ్లీల మధ్య ఉన్న దశాబ్దాల నాటి అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. పాఠశాల స్థాయిలో వారు నెలకొల్పిన ప్రపంచ రికార్డు భాగస్వామ్యాన్ని అభిమానులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.
ట్విట్టర్ (X) మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో కాంబ్లీ ఫోటోలు చూసిన క్రికెట్ ప్రేమికులు ఇలా వ్యాఖ్యానిస్తున్నారు.కాంబ్లీని మళ్లీ క్రికెట్ మైదానంలో చూడటం చాలా సంతోషంగా ఉంది. సచిన్-వినోద్ జోడీ ఎప్పటికీ స్పెషల్..ముంబై ఇండియన్స్‌కు మద్దతు ఇవ్వడమే కాదు, తన స్నేహితుడు సచిన్ కోసం ఆయన ఇక్కడికి వచ్చారు. ఇదే అసలైన స్నేహం అన్నారు.
Also Read;విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీం!
ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో వరుస కష్టాల్లో ఉన్నప్పటికీ, కాంబ్లీ వంటి మాజీ ఆటగాళ్లు స్టేడియానికి వచ్చి మద్దతు తెలపడం జట్టుకు మరియు అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. కాంబ్లీ ఆరోగ్యంగా, ఉత్సాహంగా కనిపించడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

