రెజ్లింగ్ పోటీలకు వినేశ్ ఫోగాట్ గుడ్ బై

14
- Advertisement -

రెజ్లింగ్ పోటీలకు గుడ్ బై చెప్పింది భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్. ఈ మేరకు తన నిర్ణయాన్ని ఎక్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది వినేశ్. కుస్తీ నాపై గెలిచింది. నేను ఓడిపోయాను… నన్ను క్షమించండి. మీ కల, నా ధైర్యం విచ్చిన్నమయ్యాయి. ఇక నాకు పోరాడే బలం లేదు అంటూ ఎమోషన్ కి గురైంది వినేశ్. పారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరిన వినేశ్ అనూహ్య రీతిలో అదనపు బరువుతో అనర్హతకు గురైంది.

మరోవైపు తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఫొగాట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ను ఆశ్రయించింది. తను సిల్వర్ మెడల్ కు అర్హురాలినని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై ఆర్బిట్రేషన్ తీర్పు వెలువడించాల్సి ఉంది. ఇంతలోనే వినేశ్ ఈ నిర్ణయం తీసుకుంది.

Also Read:Paris Olympics: వినేశ్ ఫొగాట్ పతకం ఆశలు గల్లంతు

()1994 ఆగస్ట్ 28 న హర్యానా లో పుట్టిన రెజ్లర్ వినేశ్ ఫోగాట్

()2018 ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన రెజ్లర్ వినేశ్ ఫోగాట్

()2022, 2019 లో సీనియర్ వరల్డ్ చాంపియన్ షిప్ లో కాంస్య పతకం నిలిచిన వినేశ్ ఫోగాట్

()2020, 2016 లో జరిగిన ఆసియా పోటీల్లో కాంస్య మెడల్ సాధించిన వినేశ్ ఫోగాట్

()2018, 2017, 2015 నుంచి సీనియర్ ఏషియన్ ఛాంపియన్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన వినేశ్ ఫోగాట్

()2022, 2018, 2014 కామన్ వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన వినేశ్ ఫోగాట్

- Advertisement -