ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది గేమర్ల అభిమానాన్ని పొందిన ప్రముఖ వీడియో గేమ్ ‘కాల్ ఆఫ్ డ్యూటీ’ (COD) కో-క్రియేటర్ విన్స్ జంపెల్లా మృతి గేమింగ్ ప్రపంచాన్ని విషాదంలో ముంచింది. కాలిఫోర్నియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ప్రమాదం ఆయన అభిమానులు, గేమింగ్ పరిశ్రమలోని ప్రముఖులను తీవ్రంగా కలచివేసింది.
వివరాల ప్రకారం, విన్స్ జంపెల్లా ప్రయాణిస్తున్న ఫెరారీ కారు అతివేగంతో దూసుకెళ్లి డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రహదారి పక్కనున్న కొండను ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే కారు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో విన్స్ జంపెల్లాతో పాటు ఆయనతో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటన స్థలానికి చేరుకున్న అత్యవసర సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినా అప్పటికే ప్రాణనష్టం జరిగిపోయింది.
‘కాల్ ఆఫ్ డ్యూటీ’ సిరీస్‌ను ప్రపంచ స్థాయిలో అత్యంత ప్రజాదరణ పొందిన గేమ్‌గా నిలబెట్టడంలో విన్స్ జంపెల్లా కీలక పాత్ర పోషించారు. ఆయన సృజనాత్మక ఆలోచనలు, వినూత్న గేమ్ డిజైన్‌లు గేమింగ్ పరిశ్రమకు కొత్త దిశను చూపాయి. ముఖ్యంగా ఫస్ట్ పర్సన్ షూటర్ గేమ్స్‌కు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయి.
Also Read:KTR:పీవీ వర్ధంతి…కేటీఆర్ నివాళి
విన్స్ జంపెల్లా మృతిపై గేమర్లు, ‘కాల్ ఆఫ్ డ్యూటీ’ బృందం, గేమింగ్ సంస్థలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సానుభూతిని తెలియజేశాయి. ఆయన లేని లోటు గేమింగ్ ప్రపంచంలో ఎన్నటికీ తీరదని పలువురు పేర్కొంటున్నారు.

