‘వెరైటీ’గణపయ్యలు’

799
kcr ganesh
- Advertisement -

దేశ వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఊరూర, వాడవాడల ఏర్పాటు చేసిన మండపాల్లో కొలువుదీరిన బొజ్జ గణపయ్యలు భక్తులచే పూజలందుకుంటున్నారు. తీరొక్క రూపాల్లో కొలువైన విఘ్నేశ్వరులను భక్తులు పూజిస్తున్నారు. కడుపు నిండే వంటలు, వినసొంపుగుండే పాటలు, చమక్కుమనే డెకరేషన్లతో గల్లిగల్లికో తీరుగా దర్శనమిస్తుండు బొజ్జగణపయ్య. బాల గణపతి.. బొజ్జ గణపయ్య.. చెరకు తోట వినాయకుడు.. ఇలా రకరకాల ఆకారాల్లో గణనాథులు కొలువుదీరుతున్నారు.

eco-friendly-ganeshji

కొత్త దనానికి తోడు..కాస్త సృజనాత్మకతను జోడించడంతో ఈసారి వినూత్న వినాయకులు భక్తుల పూజలందుకుంటున్నారు. పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన ఫలితంగా ఎకో ఫ్రెండ్లీ విగ్రహాల ఏర్పాటూ పెరుగుతోంది. మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి పర్యావరణానికి తాము మిత్రులమని చాటుతున్నారు కొందరు భక్తులు. వడియాల గణపతి, మొక్కజొన్న పొత్తుల గణనాథుడు, పర్యావరణ వినాయకుడు, స్టీల్‌ వినాయక విగ్రహం వంటి రూపాల్లో గణపయ్యను కొలుస్తున్నారు భక్తులు.

eco-friendly-ganeshji

ఈ క్రమంలోనే పూణెలో ఏర్పాటు చేసిన పానీపూరీ గణపతి ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. పూణెలో గణేష్ భెల్ అనే చాట్ షాపు ఓనర్ రమేష్ గుడ్‌మెవార్ 10వేల పానీపూరీలు, కొన్ని వెదురు కర్రలతో పానీ పూరీ విఘ్నేశ్వరున్ని తయారు చేయించి మండపంలో ఏర్పాటు చేశాడు. పర్యావరణ హితమైన గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని చెబుతుండడంతో తాను ఇలా గణపతిని తయారు చేయించి ఏర్పాటు చేశానని రమేష్ చెప్పాడు.

- Advertisement -