ఒకే ఫ్రేంలో వినాయక్-ప్రభాస్..వైరల్!

5
- Advertisement -

రాజాసాబ్ తో నిరాశపర్చిన ప్రభాస్ తన తదుపరి సినిమాలపై దృష్టి సారించారు. అయితే రాజాసాబ్ నిర్మాతలతో మళ్లీ కలిసి పని చేసేందుకు ప్రభాస్ రెడీ అయ్యారు. ఇదిలా ఉండగా, దర్శకులు మెహర్ రమేష్, వీవీ వినాయక్‌లతో కలిసి ప్రభాస్ దిగిన తాజా ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మెహర్ రమేష్ షేర్ చేసిన ఈ సెల్ఫీ నెటిజన్లలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ముగ్గురు కలిసి ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారా? లేక ఇది స్నేహపూర్వక సమావేశమా? అన్న సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి.

Also Read:Modi:ప్రధాని మోదీ అరుదైన ఘనత..

ఈ భేటీ వినాయక్ నివాసంలో నిర్వహించిన ప్రైవేట్ పార్టీలో జరిగింది. ప్రభాస్, మెహర్ రమేష్ అతిథులుగా హాజరయ్యారు. ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 AD సీక్వెల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్‌లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాల్గొంటున్నారు. ఇవే కాకుండా, ఫౌజీ చివరి దశలో ఉండగా, స్పిరిట్ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది.

- Advertisement -