పోలీస్…వినాయకుడు

761
Vile Parle's Inspector Ganesha
- Advertisement -

లంబోదరుడు, హేరంబుడు, గజాననుడు, ఏక దంతుడు, మూషిక వాహనుడు.. ఇలా పేరేదేనా.. ఏ ఆపద వచ్చినా పిలుచేది ఆ వినయకున్నే. తాను స్వయంభువుగా ఆవిర్భవించిన ఆలయాల్లోనే కాదు, ఇతర దైవ క్షేత్రాల్లోనేూ తనదైన ప్రత్యేక స్థానంలో కొలువై కనిపిస్తుంటాడు. వివిధ రూపాల్లో దర్శనమిచ్చే దైవాల్లో వినాయకుడే ముందువరుసలో కనిపిస్తుంటాడు. వివిధ ప్రాంతాల్లో లంబోదరుడు వివిధ రూపాల్లో ప్రజలకు దర్శనం ఇస్తు కనువిందు చేస్తున్నాడు.

తాజాగా మహారాష్ట్రలో ఏర్పాటుచేసిన పోలీస్ వినాయకుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. విలే పార్లె పోలీస్ స్టేషన్‌ ఆకృతిలో వినాయక మండపాన్ని నిర్మించి, అందులో గణేశ్‌ విగ్రహాన్ని ఉంచారు. ఇన్స్‌పెక్టర్ లా ఖాకీ దుస్తులు వేసుకోగా పోలీస్ స్టేషన్‌లో గోడలపై ఫొటోలు ఉంచినట్లే, ఈ మండపంలోనూ వారి ఫొటోలు పెట్టారు. గణేశుడు కూర్చున్న కుర్చీకి కుడి వైపున కాగాగారం ఉన్నట్లు అందులో దొంగలని ఉంచినట్లు మండపం ఉంది. దీనిని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

police ganapati

బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ‘హిట్‌ అండ్‌ రన్‌ కేసు-2002’లో విచారణ జరిపి మంచి పేరు తెచ్చుకున్నారు పోలీస్‌ ఇన్స్‌పెక్టర్ రాజేంద్ర కానె. నేరాలు, శిక్షలపై అవగాహన కల్పిస్తూ ఇప్పటివరకు 150 షార్ట్‌ ఫిలిమ్స్‌ తీశారు. ప్రజల్లో పలు విషయాల పట్ల అవగాహన కల్పించడంలో ఎల్లప్పుడూ ఉత్సాహాన్ని చూపే ఆయన.. వినాయక చవితి సందర్భంగా ఈ సారి పోలీసు అధికారి వేషంలో ఈ గణేశుడి విగ్రహాన్ని రూపొందించి ఆకట్టుకున్నారు.

- Advertisement -