ఓటీటీలోకి విక్రాంత్ రోణ..

22
vikrant rona
- Advertisement -

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా నటించిన చిత్రం విక్రాంత్ రోణ. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలోని రక్కమ్మ సాంగ్ మాత్రం సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.

తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ ఖరారైంది. సెప్టెంబర్ 2ను జీ5 ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5 భారీ రేటుకు సొంతం చేసుకుంది. సినిమా థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడలేకపోయిన వారు, ఓటీటీలో చూసి ఖచ్చితంగా ఆదరిస్తారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వెలిన్ ఫర్నాండెజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

- Advertisement -