చంద్రయాన్‌ 2..మరో కీలకఘట్టం

627
chandrayaan 2
- Advertisement -

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2లో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. ఆర్బిటర్‌ నుంచి విక్రమ్‌ ల్యాండర్‌ విడిపోయే ప్రక్రియ విజయవంతమైనట్టు ఇస్రో ప్రకటించింది. సోమవారం మధ్యాహ్నం 12.45 నుంచి 1:15 గంటల మధ్య ఈ ప్రక్రియ పూర్తిచేశారు. ల్యాండర్‌ విడిపోయే ప్రక్రియపై ఉత్కంఠగా ఎదురుచూసిన ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతం కావడంతో సంబరాలు చేసుకున్నారు.

ఆదివారం సాయంత్రం 06.21 గంటలకు ఐదోసారి(ఆఖరి) కక్ష్య కుదింపు ప్రక్రియను విజయవంతంగా చేపట్టింది. 52 సెకన్లపాటు ప్రొపల్షన్ సిస్టమ్ ను మండించి 119 కి.మీ. x 127 కి.మీ. కక్ష్యలోకి చంద్రయాన్-2ను విజయవంతంగా చేర్చాం అని ఇస్రో తెలిపింది. ఈ నెల 7వ తేదీన చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ దిగనుంది. జులై 22న శ్రీహరికోట నుంచి చంద్రయాన్ -2 నింగిలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే.

- Advertisement -