టాలీవుడ్‌లో న్యాచురల్ స్టార్ నానికంటూ ఓ ప్రత్యేకమైన స్థానం వుంది. కొత్త తరహా పాత్రలు చేసుకుంటు ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. మన ఇంట్లో ఉండే కుర్రాడిలా, ఆయన ఎంచుకునే పాత్రలు ఉంటాయి. అందువల్లనే ఆయన ఖాతాలో విజయాలు ఎక్కువగా ఉంటాయి. ఇటీవల దేవదాస్ చిత్రంతో అలరించిన నాని ప్రస్తుతం ‘జెర్సీ’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తరువాత దర్శకుడు విక్రమ్ కుమార్‌తో కలిసి మరో సినిమా చేయనున్నాట్లు సినీ వర్గాల సమాచారం.
ఇదివరకే ఈ ఇద్దరూ కలిసి ఒక సినిమా చేయాలనుకున్నారట.. కానీ అనుకోని కారణాల వలన వాయిదా పడిందట. అయితే దర్శకుడు విక్రమ్ కుమార్ బన్నీతో ఓ సినిమా చేయవలసి ఉండగా ఆ ప్రాజెక్టు వాయిదా పడటంతో, అంతకు ముందు నానితో అనుకున్న సినిమా చేయడానికి విక్రమ్ రెడీ అవుతున్నాడు. అశ్వనీదత్ బ్యానర్‌లో ఈ చిత్ర నిర్మించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ మూవీ ఎప్పటికి పట్టాలెక్కుతుందో చూడాలి.