విక్రమ్ ‘కోబ్రా’ ఫస్ట్‌ లుక్‌..

558
vikram
- Advertisement -

హీరో చియాన్ విక్రమ్ వరుసగా పెద్ద సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. అందులో భారీ అంచనాలు ఉన్న చిత్రం ‘కోబ్రా’. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి విక్రమ్ ఫస్టులుక్ పోస్టర్ ను శుక్రవారం సాయంత్రం 5 గంటలకు వదలనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.

వయకామ్ .. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి, ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో విక్రమ్ 25 వేషధారణల్లో కనిపించనుండటం విశేషమని చెబుతున్నారు. దీనిని బట్టే ఈ కథలో ఎన్ని మలుపులుంటాయనేది అర్థమవుతోంది.

- Advertisement -