Vikas Raj:రీ పోలింగ్ అవసరం లేదు

35
- Advertisement -

రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదన్నారు సీఈసీ వికాస్ రాజ్. పోలింగ్ శాతం కొంచెం పెరగొచ్చు… రాత్రి 10 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ జరిగిందన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి కచ్చితమైన పోలింగ్ వివరాలు అందడం వల్లే పూర్తి స్థాయి పోలింగ్ శాతం రాలేదన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ శాతం 70.74 శాతం నమోదయిందన్నారు.

ప్రతి 10 పోలింగ్ కేంద్రాలకు ఒక అధికారిని నియమించామని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ తర్వాత ఈవీఎం కౌంటింగ్ మొదలవుతుందన్నారు. ఓట్ల లెక్కింపు కోసం ముమ్మర ఏర్పాట్లు చేశామన్నారు.

ఎన్నికల కోసం 2 లక్షల మంది కంటే ఎక్కువమంది కష్టపడ్డారన్నారు. అత్యల్పంగా హైదరాబాద్‌లో పోలింగ్ నమోదైందన్నారు. స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. రాష్ట్రంలో 70 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు. ఓట్ ఫ్రం హోం నుండి మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మొదలవుతుందన్నారు.

Also Read:30 ఏళ్ల అయినా ఇప్ప‌టికీ అదే గ్లామర్!

- Advertisement -