మొక్కలు నాటిన కలెక్టర్ మస్రత్ ఖానం అమేషా..

317
vikarabad collector
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ మస్రత్‌ ఖానం అయేషా కలెక్టర్ కార్యాలయంలో మూడు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని ఈ కార్యక్రమంలో తనను భాగస్వామి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు . మొక్కలు నాటడమే కాకుండా వాటిని ఎదిగే వరకు సంరక్షించే బాధ్యత కూడ అందరం తీసుకోవాలని కోరారు.

పర్యావరణ పరిరక్షణ కోసం సంతోష్ కుమార్ గారు చేపట్టిన ఈ గ్రీన్ ఛాలెంజ్ లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని , ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం ఒక అలవాటు గా చేసుకోవాలని కోరారు. వారు మరో ముగ్గురిని నామినేట్ చేశారు , జిల్లా సబ్ కలెక్టర్ , ఆర్డీవో మరియు జిల్లా ఎస్పీ గార్లని మూడు మొక్కలు నాటాలని కోరారు.

vikarabad

- Advertisement -