తెలుగు సినిమా ఖ్యాతిని చాటిన ప్రపంచానికి చాటిచెప్పిన చిత్రం బాహుబలి. ప్రభాస్ ను ఇప్పుడు ప్రపంచం మొత్తం గుర్తిపడుతుంది అంటే కారణం జక్కన. దీని వెనకాల రైటర్ విజయేంద్రప్రసాద్ ఉన్నారు అని మాత్రం మర్చిపోవద్దు. ఇన్ని సంచలనాలకు నాంది పలికింది ఆయనే. తర్వాత బాలీవుడ్‌లో సల్మాన్..బజరంగీ భాయ్ జాన్ చిత్రంతో మంచి హిట్ కొట్టారు. ప్రస్తుతం కంగనా రనౌత్ నటిస్తున్న “మణికర్ణిక ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ” కు కూడా ఆయనే రైటర్. అలాంటి మోస్ట్ టాలెంటెడ్ రైటర్ షారుఖ్ కోసం ఒక మంచి కథను సిద్ధం చేస్తున్నారని కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి.
అయితే ఇవన్నీ ఆధారాలులేని వార్తలని కొట్టిపారేశారు విజయేంద్రప్రసాద్. షారుక్ సినిమాకు దర్శకత్వం వహించేందుకు సన్నాహాలు చేయడం లేదన్నారు. ప్రస్తుతం తను ‘మణికర్ణిక’ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలిపారు.
విజయేంద్ర ప్రసాద్ తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 25 చిత్రాలకు కథ అందించారు. వీటిలో దాదాపు అన్ని బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించినవే. ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. ఆయన తెరకెక్కించిన ‘శ్రీవల్లి’ గత ఏడాది విడుదలైంది. తమిళ హీరో విజయ్ 62వ సినిమాకు కూడా విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు.