విజయవాడ, విశాఖ మెట్రో..టెండర్లు

3
- Advertisement -

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 50:50 భాగస్వామ్యంతో ఏపీలో మెట్రో ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టనున్నారు. విశాఖ మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.4,101 కోట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. విశాఖ మెట్రోకు వీఎంఆర్డీఏ నుంచి నిధులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

విజయవాడ మెట్రోకు సీఆర్డీఏ నుంచి నిధులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సీఆర్డీఏ నుంచి రూ. 3,497 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ, విశాఖ మెట్రో రైలుకు రేపు టెండర్లు పిలవనుంది ప్రభుత్వం. రూ.21,616 కోట్లతో విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు టెండర్లు పిలవనుంది. రూ.10,118 కోట్లతో విజయవాడ మెట్రో రైలుకు టెండర్లు పిలవగా రూ.11,498 కోట్లతో విశాఖ మెట్రో రైలుకు టెండర్లు పిలవననున్నారు.

నవంబర్‌లో ఏపీలో క్వాంటం కంప్యూటర్ ఆవిష్కరణ చేపట్టనున్నట్లు తెలిపారు సీఎం చంద్రబాబు. దేశంలోనే తొలిసారి అమరావతిలో ఆవిష్కరణ చేయనుండగా వ్యవసాయం, నీటి నిర్వహణ, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి అని… నేషనల్ క్వాంటం మిషన్‌కు కృతజ్ఞతలు చెప్పారు చంద్రబాబు.

Also Read:కింగ్డమ్ టికెట్ ధరల పెంపు

- Advertisement -