‘‘డాడీ.. నీ దగ్గర డబ్బుల్లేవంటున్నావ్.. కనీసం నా ఇల్లుందిగా.. ఈ ఇంటిని అమ్మేసి ఆ డబ్బులతో అయినా నాకు ట్రీట్‌మెంట్ చేయించు డాడీ.. ట్రీట్‌మెంట్ లేకపోతే ఎక్కువ రోజులు నేను బతకనంట డాడీ.. ఏదో ఒకటి చేసి నన్ను కాపాడు డాడీ.. నన్ను బ్రతికించు డాడీ.. నేను స్కూల్‌కెళ్లి ఎన్ని మంత్స్ అయిందో నీకు తెలుసు కదా డాడీ.. నా ఫ్రెండ్స్‌తో ఆడుకోవాలనుంది..” అంటూ తనను బతికించాలని తండ్రికి సాయిశ్రీ వీడియో మెసేజ్ చేసింది. ఇంత ప్రాథేయపడినా ఆ తండ్రి గుండె కరగలేదు. జరగరానిదే జరిగిపోయింది. వ్యాధి ముదిరింది. ఆ చిన్నారి కోరిక తీరకుండానే సాయిశ్రీ అశువులు బాసింది. ఆదివారం మధ్యాహ్నం ఈ లోకాన్ని వదిలి వెళ్లింది.
వైద్యానికి డబ్బులు లేక బాలిక సాయిశ్రీ మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సాయిశ్రీ తల్లిదండ్రులు విడివిడిగా ఉంటున్నారు.
సాయిశ్రీ పేరుపై ఉన్న ఇంటిని ఓ ఎమ్మెల్యే బంధువు కబ్జా చేశారు. ఇంటిని అమ్మకుండా కబ్జాదారులు అడ్డుకుంటున్నారు. సాయిశ్రీ వైద్యానికి డబ్బులు లేక తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 10 రోజుల పాటు ఇంటి ఎదుట సాయిశ్రీ తల్లి ఆందోళన చేసింది.
మాదంశెట్టి సుమశ్రీ తన కుమార్తె సాయిశ్రీతో కలసి విజయవాడ దుర్గానగర్‌లోని ఓ అపార్టుమెంటు ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. సుమశ్రీ భర్త మాదంశెట్టి శివకుమార్ ఆ ఫ్లాట్‌ను కుమార్తె సాయిశ్రీ పేరిట రాశారు. సంరక్షకుడిగా తన పేరే పెట్టుకున్నారు. అయితే కొంత కాలంగా సుమశ్రీ, శివకుమార్ మధ్య విభేదాలు పొడచూపాయి. ఈ నేపథ్యంలో సాయిశ్రీ క్యాన్సర్ బారిన పడింది. ఖరీదైన వైద్యం చేయిస్తే తప్ప ఫలితం ఉండదని వైద్యులు చెప్పారు. దీంతో తాము ఉంటున్న ఇంటిని విక్రయించి కుమార్తెకు వైద్యం చేయించాలని తల్లి సుమశ్రీ భావించారు. ఆ ఇల్లు మైనర్ అయిన కుమార్తె పేరిట ఉండటంతో సంరక్షకుడిగా ఉన్న తండ్రి శివకుమార్ సమ్మతించాల్సి ఉంది. ఇందు కు ఆయన అంగీకరించలేదు సరికదా అందుబాటులో లేకుండాపోయారు. దీంతో ఏం చేయాలో తెలియక తల్లీకూతుళ్లు తల్లడిల్లిపోయారు.
నేను ఎక్కువ రోజులు బతకనంట డాడీ..
‘‘డాడీ.. నీ దగ్గర డబ్బుల్లేవంటున్నావ్..
కనీసం నా ఇల్లుందిగా.. ఈ ఇంటిని అమ్మేసి ఆ డబ్బులతో అయినా నాకు ట్రీట్‌మెంట్ చేయించు డాడీ..
ట్రీట్‌మెంట్ లేకపోతే ఎక్కువ రోజులు నేను బతకనంట డాడీ.. ఏదో ఒకటి చేసి నన్ను కాపాడు డాడీ..
నన్ను బ్రతికించు డాడీ..
నేను స్కూల్‌కెళ్లి ఎన్ని మంత్స్ అయిందో
నీకు తెలుసు కదా డాడీ..
నా ఫ్రెండ్స్‌తో ఆడుకోవాలనుంది..
దయచేసి నాకు ట్రీట్‌మెంట్ చేయిస్తే హ్యాపీగా
నేను టెన్త్ క్లాస్ చదువుకుంటా.. స్కూలుకెళ్తా..
నా ప్రాణాలు కాపాడు డాడీ.. నీకు దండం పెడతా..
చేయి కూడా నొప్పిగా ఉంది డాడీ..
నీకు దండం పెడదామంటే
చేయి వాచిపోయి నొప్పిగా ఉంది డాడీ..
కాళ్లు కూడా వాచి పోయాయి డాడీ..
కుంటుతూ నడుస్తున్నా డాడీ..
ఎప్పుడూ నన్ను మీ అమ్మతో పోలుస్తావుగా డాడీ.. వెంకట సుబ్బమ్మ అంటావుగా.. మీ మమ్మీకే డిసీజ్ వచ్చిందనుకుని నాకు ట్రీట్‌మెంట్ చేయించు డాడీ.. నాకు ఇపుడు ట్రీట్‌మెంట్ అవసరం అంట డాడీ..
నాకు ట్రీట్‌మెంట్ లేకపోతే ఇంక బతకనంటా..
అమ్మ దగ్గర డబ్బుల్లేవు డాడీ.. నిజంగా అమ్మ దగ్గర డబ్బుల్లేవు.. ఒకవేళ నీ డబ్బులు ఏమైనా మా మమ్మి తింటుందనుకుంటే మాకెవ్వరికీ డబ్బులివ్వద్దు..
నువ్వే నన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ చేయిం చు డాడీ.. నాకు అవసరమైనప్పుడల్లా ఆ డబ్బులు నువ్వే ఆస్పత్రిలో కట్టు డాడీ.. మమ్మీకి కూడా ఇవ్వద్దు..
నాకేమన్నా అయితే మీ నలుగురే దానికి బాధ్యత వహిస్తారు డాడీ.. మాదంశెట్టి శివకుమార్ నువ్వు నా తండ్రిగా, నీ కొడుకులు మాదంశెట్టి శివరామకృష్ణ, మాదంశెట్టి సీతారాం కృష్ణ, నీ భార్య మాదంశెట్టి కృష్ణకుమారి.. మీరు నలుగురూ కలసి ఈ ఆస్తికి అడ్డు వస్తానని ఇన్‌డైరెక్టుగా నన్ను చంపేయాలనుకుంటున్నారు.. మీ చేతికి మట్టి అంటకుండా నా కొచ్చిన జబ్బుతోనే చంపేయాలని చూస్తున్నారు కదా డాడీ..
దయచేసి ఈ వీడియో చూసిన టూ త్రీ డేస్‌లో నువ్వు రెస్పాండ్ అవ్వు డాడీ.. ఒకవేళ ఇదంతా నువ్వు నమ్మకపోతే వీడియో కాల్ చేయి డాడీ.. నేనే మాట్లాడుతా.. కనీసం నాతో మాట్లాడటానికి ఇష్టం లేకపోతే ఇదిగో ఇవన్నీ చూడు డాడీ..
కొంచెమన్నా నా మీద జాలి చూపించు డాడీ..
నేను కూడా నీ కూతురునే కదా డాడీ..
ప్రేమ కాకపోయినా కనీసం జాలి అయినా చూపించు డాడీ.. ట్రీట్‌మెంట్ చేయించు డాడీ.. ప్లీజ్ డాడీ..’ చరమాంకంలో ఆ బిడ్డ తన తండ్రికి పంపిన వీడియోలోని ఒక్కో మాట వింటుంటే కళ్లెంట నీరు ఆగలేదు.. ఈ హృదయవిదారక ఘటనపై సాయిశ్రీ తల్లి సుమశ్రీ ఆదివారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. తన భర్త నిర్లక్ష్యం, కుమార్తె పడ్డ అవస్థలపై తన ఆవేదనను వెలిబుచ్చారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న కన్న కుమార్తెకు సరైన వైద్యం చేయించకుండా అడ్డుపడిన భర్త శివకుమార్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
https://youtu.be/8cRcaWoeHOg
https://youtu.be/wpxTOC7C-aY