కాంగ్రెస్‌కు షాక్‌.. బీజేపీలోకి విజయశాంతి..

370
Vijayashanthi
- Advertisement -

సినీ నటి, తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి సోమవారం బీజేపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఓ జాతీయ మీడియా వెల్లడించింది. ఎట్టకేలకు రాములమ్మ బీజేపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. కాషాయం కండువా కప్పుకునేందుకు ముహుర్తం ఫిక్స్ చేశారు. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సోమవారం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు.

సోమవారం ఉదయం 11 గంటలకు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు విజయశాంతి. ఢిల్లీకి వెళ్లనున్న ఆమె సాయంత్రం అమిత్ షాతో భేటీ అవుతున్నారు. బీజేపీ ద్వారానే రాజకీయాల్లో అడుగుపెట్టిన విజయశాంతి సుమారు రెండు దశాబ్ధాల అనంతరం తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. అనంతరం పలువురు కేంద్ర పెద్దల్ని కలిసి..కీలక విషయాలపై చర్చించ నున్నారు.

- Advertisement -