లేడీ అమితాబ్ విజయశాంతి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన అనేక ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ క్రమంలో విజయశాంతి తన సినీ కెరీర్‌లో జరిగిన ఒక భయానక సంఘటన గురించి చెప్పారు. విజయశాంతి మాటల్లోనే విందాం. “అదొక తమిళ సినిమా, అందులో విజయకాంత్ హీరో. ఫారెస్టులోని ఒక గుడిసెలో నన్ను కట్టేసి.. గుడిసెను తగులబెట్టాలి. గుడిసెను అంటించే సమయానికి ఒక్కసారిగా పెద్ద గాలి వచ్చింది. దాంతో ఒక్కసారిగా మంట గుడిసె మొత్తం అంటుకుంది. నేను ఆ మంటల్లో నుంచి బయటకు రాలేకపోయాను. అప్పుడు ఒక్కసారిగా విజయ్‌కాంత్ గారు వచ్చి నన్ను కాపాడారు” అని ఆమె చెప్పారు.
అలాగే విజయశాంతి గారు ఇంకా మాట్లాడుతూ.. తన చిన్నతనంలోనే తన అమ్మనాన్న చనిపోయారని, అప్పటి నుంచి ఒంటరి పోరాటం చేస్తున్నానని ఆమె ఎమోషనల్ అయ్యారు. ఇప్పటివరకు తాను 5 భాషల్లో 180 సినిమాల్లో నటించినట్లు తెలిపారు. ఇక తానూ చేసిన చిత్రాల్లో విజయశాంతి గారికి బాగా నచ్చిన సినిమాలను కూడా చెప్పారు. కర్తవ్యం, ప్రతిఘటన, ఒసేయ్ రాములమ్మ సినిమాలు తనకి చాలా ఇష్టమని ఆమె చెప్పారు.
అలాగే అప్పట్లో తను తీసుకున్న పారితోషికం పై విజయశాంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అమితాబ్, రజినీ తరువాత అత్యధిక పారితోషికం అందుకున్నది తానేనని, తన సినీ కెరీర్ లో కోటి రూపాయల పారితోషికం తీసుకునే వరకు తాను వెళ్లినట్లు విజయశాంతి వివరించారు. హీరోయిన్ గానే కాకుండా ఒక పొలిటీషియన్ గా కూడా విజయశాంతి తనదైన ముద్రను వేశారు.
ఇవి కూడా చదవండి…