మహేశ్ బాబుకు ధ్యాంక్స్ చెప్పిన విజయశాంతి

267
vijayashanthi
- Advertisement -

లేడీ అమితాబ్ విజయశాంతి పుట్టన రోజు నేడు. ఈసందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షాలు తెలుపుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆమెకు పుట్టినరోజు విషెష్ తెలిపారు. విజయశాంతిగారు మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషంగా ఉండాలని కొరుకుంటున్నానని మహేవ్ బాబు ట్వీట్ చేశాడు. తాజాగా మహేశ్ బాబు ట్వీట్ కు రిప్లై ఇచ్చింది విజయశాంతి.

నాకు పుట్టినరోజు విషెస్ చెప్పినందుకు చాలా ధ్యాంక్యూ మహేశ్ బాబు గారు అంటూ విజయశాంతి ట్వీట్ చేసింది. కాగా ట్వీట్టర్ వేదికగా చాలా మంది అభిమానులు విజయశాంతికి విషెస్ తెలుసుతున్నారు. 13సంవత్సరాల తర్వాత విజయశాంతి సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయశాంతి నటించింది. మరోవైపు దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా ఆమెకు విషెస్ తెలిపారు. మీరు నటించే సినిమాలకు మీరే ఓ గొప్ప సంపదలా కనపడతారు. సరిలేరు నీకెవ్వరు సినిమాకు మీరందించిన సహకారాన్ని వివరించడానికి పదాలు సరిపోవు’ హ్యాపి బర్త్ డే మేడం అంటూ పోస్ట్ చేశారు.

- Advertisement -