సంధ్య థియేటర్ ఘటనపై విజయశాంతి

5
- Advertisement -

పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆ తర్వాత అల్లు అర్జుస్ అరెస్ట్, ఓయూ జేఏసీ నేతలు బన్నీ ఇంటిపై దాడి చేసిన నేపథ్యంలో స్పందించారు నటి విజయశాంతి.

ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్ట సంఘటన ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య తెలంగాణల విభజన రేఖలు తెచ్చే వరకు వెళుతున్నట్లు, గత రెండు రోజుల పరిణామాలు, ప్రెస్ మీట్లు తదనంతర భావోద్వేగాలు కనిపిస్తున్నాయి అన్నారు. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసుందాం అనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అట్లా కాక మల్లా ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకు నడవాలనేది ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రయోగంగా కనిపిస్తుంది అని విజయశాంతి అన్నారు.

ఏది ఏమైనా ఒక సంఘటనను బీజేపీ తమకు అనుకూలంగా చేసుకునే ప్రక్రియగా ఈ అంశాలు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని బీజేపీ నేతల ప్రకటనలను బట్టి అర్ధమవుతుందని తెలిపారు. సినిమా పరిశ్రమను నాశనం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీజేపీ కేంద్ర మంత్రులు ఆరోపణలు చేయడం గర్హనీయం అని ట్వీట్ చేశారు విజయశాంతి.

Also Read:బన్నీ ఇంటిపై దాడి సరికాదు: సీఎం రేవంత్

- Advertisement -