కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులపై కీలక కామెంట్ చేశారు కాంగ్రెస్ నేత విజయశాంతి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలంగాణకు కనీసం నాలుగు అయినా వచ్చి ఉండాలి.. అనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని తప్పక పరిశీలించాల్సిన విషయం. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది ఎంపీలున్న బీజేపీ కూడా కొంత ఆలోచన చేస్తే మంచిదే అంటూ విజయశాంతి పేర్కొన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా 139 మందికి కేంద్రం పద్మ పురస్కారాలు ప్రకటించింది. వీరిలో ఏడుగురికి పద్మ విభూషణ్, 19మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మ శ్రీ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డ్లల్ల తెలంగాణకు కనీసం 4 పద్మ అవార్డులు ఐనా వచ్చి ఉండాలి.. అనే తెలంగాణ సీఎం @revanth_anumula గారి అభిప్రాయం పరిశీలనాత్మకం, తప్పక..
తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలున్న బీజేపీ కూడా కొంత ఆలోచన చేస్తే మంచిదే, ఈ అంశం.
హర హర… pic.twitter.com/CaWTdlb9wo
— VIJAYASHANTHI (@vijayashanthi_m) January 26, 2025
Also Read:28న తండేల్ ట్రైలర్