‘సరిలేరు నీకెవ్వరు’ విజయశాంతి ఫస్ట్ లుక్ వ‌చ్చేసింది

316
vijayashanthi Look

సూపర్ స్టార్ మహేశ్ బాబు, హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. మహేశ్ సరసన రష్మీక మందన హీరోయిన్ గా నటింస్తుంది. ఈమూవీలో మహేశ్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈమూవీ టీజర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. దీపావ‌ళి సంద‌ర్భంగా స‌రిలేరు నీకెవ్వ‌రు మూవీ నుండి విజ‌య శాంతి లుక్ విడుద‌ల చేసారు.

భార‌తి పాత్ర‌లో అల‌రించ‌నుంది.ఇందులో విజ‌య శాంతి లుక్ అభిమానుల‌లో ఆస‌క్తి క‌లిగిస్తుంది. విజయశాంతి 13ఏళ్ల తర్వాత స‌రిలేరు నీకెవ్వ‌రు అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుండ‌డంతో ఈ సినిమాపై ఆమె అభిమానుల‌లో చాలా ఆస‌క్తి నెల‌కొంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మహర్షి చిత్రం తర్వాత మహేశ్ బాబు చేస్తోన్న మూవీ కావడంతోఈ మూవీ భారీగా ఆశలు పెట్టుకున్నారు అభిమానులు.