రాములమ్మ ఎఫెక్ట్ : బీజేపీ ‘షట్ డౌన్’!

31
- Advertisement -

తెలంగాణలో బీజేపీ పరిస్థితి రోజు రోజుకు మరింత దిగజారిపోతుంది. ఇప్పటికే చాలామంది నేతలు కమలం పార్టీ నుంచి బయటకు వస్తుంటే.. ఇప్పుడు తాజాగా ఎంపీ విజయశాంతి కూడా ఆ పార్టీ వీడడంతో ఒక్కసారిగా కమలం పార్టీలో కల్లోలం మొదలైంది. నిన్న మొన్నటి వరకు పార్టీ మార్పు పై పెద్దగా స్పందించని రాములమ్మ అనూహ్యంగా బీజేపీకి గుడ్ బై చెప్పారు. గత కొన్నాళ్లుగా పార్టీలో ఆమె సైలెంట్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. కానీ పార్టీ వీడడంపై మాత్రం ఆచితూచి స్పందిస్తూ వచ్చారు విజయశాంతి. పార్టీలో కొందరికి అధిష్టానం ప్రదాన్యత ఇస్తోందని, సీనియర్ నేతలను ఎవరూ పట్టించుకోవడం లేదని గత కొన్నాళ్లుగా వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి వంటి వారు అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. దాంతో వీరంతా పార్టీ వీడతారనే భావనా అధిష్టానంలో కూడా ఉంది.

అందుకు తగ్గట్లుగానే ఆ మద్య వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటివారు బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు విజయశాంతి కూడా బీజేపీ నుంచి బయటకు రావడంతో తెలంగాణలో బీజేపీ పనైపోయిందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీలో బండి సంజయ్, ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి వంటివారు మాత్రమే కొంత యాక్టివ్ గా కనిపిస్తున్నారు. మిగిలిన చాలా మంది నేతలు, రఘునందన్, ధర్మపురి అరవింద్.. నేతలు ఉన్న లేనట్లుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆ మద్య జరిగిన అధ్యక్ష పదవి మార్పు తరువాత బండి కూడా పార్టీలో చురుగ్గా కనిపించడం లేదు. ఇలా నేతలంతా ఒక్కొక్కరుగా సైలెన్స్ పాటిస్తుండడం.. కుదిరితే పార్టీ మారడం వంటివి చేస్తుండడంతో ఎన్నికల ముందే బీజేపీ ఊహించని రీతిలో పతనం అవుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ముందు రోజుల్లో కమలం పార్టీలో ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Also Read:Harishrao:ఎన్నికల్లో గెలవగానే సన్నబియ్యం

- Advertisement -