వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా: విజయసాయి

1
- Advertisement -

నాలాంటి వాళ్లు ఇంకో వెయ్యి మంది వైసీపీని వీడినా జగన్ కు ఉన్న ప్రజాదరణ ఏమాత్రం తగ్గదు అన్నారు విజయసాయిరెడ్డి. రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు విజయసాయి రెడ్డి.

పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాను అన్నారు. రాజీనామా మాత్రమే కాదు రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. జగన్ మోహన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు అన్నారు. నాలాంటి వాళ్లు వెయ్యి మంది పార్టీని వీడినా కూడా ఆయనకు ఉన్న ప్రజాదరణ తగ్గదు అని తేల్చిచెప్పారు విజయసాయి రెడ్డి.

Also Read:లంచాల తెలంగాణ..సీఎంపై రాజాసింగ్ ఫైర్

కేసులకు భయపడే తత్వం నాది కాదు, దేన్నైనా దైర్యంగా ఎదుర్కుంటా…గవర్నర్ పదవి కానీ, బీజేపీ నుంచి ఎంపీ పదవి కానీ నేను ఎవరిదగ్గర హామీ తీసుకోలేదు అన్నారు.గళూరు, విజయవాడలో ఒక ఇల్లు, వైజాగ్ లో ఒక అపార్ట్మెంట్ ఇవే నా ఆస్తులు.నీతిగా, నిజాయితీ గా బతకాలని అనుకున్నా, కొన్ని ఛానెల్స్ నాపై అవినీతిపరుడనే ఆరోపణలు చేశాయన్నారు.

- Advertisement -