విజయ డెయిరీ పెండింగ్‌ బిల్లులు రిలీజ్

7
- Advertisement -

విజయ తెలంగాణ డెయిరీకి చెందిన పాడి రైతుల పాల బిల్లుల బకాయిలను తక్షణం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 కోట్లను విడుదల చేసింది. “పాడి రైతులకు సంబంధించిన పాల బిల్లుల బకాయిలు రేపటిలోగా చెల్లించబడతాయి. పాల బిల్లుల చెల్లింపుల విషయంలో జరిగిన జాప్యం వల్ల పాడి రైతులకు ఎదురైన ఇబ్బందులను మేము అర్థం చేసుకుంటున్నాము, మరియు జాప్యంకి విజయ తెలంగాణ డెయిరీ సానుభూతితో ఉన్నది. సకాలంలో పాల బిల్లుల చెల్లింపులు చేయడానికి మరియు ఈ లక్ష్యాన్ని సాధించడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నామని మేనేజింగ్ డైరెక్ట‌ర్ తెలిపారు.

మా పాడి రైతులు ఎలాంటి ఆందోళనలు చేయకూడదని సంయమనంతో సహాకరించాలని మనవి చేసుకుంటున్నాము, ఎందుకంటే పరిస్థితిని మేము పూర్తిగా అవగాహనతో పరిశీలిస్తున్నాము మరియు దానికి తగిన విధంగా స్పందిస్తున్నాము.

పాడి రైతులు మరింత ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, ప్రస్తుత మార్కెట్ ధర కంటే ఎక్కువ పాలు కొనుగోలు ధరను చెల్లిస్తున్నాము. మిగతా పాల బిల్లుల బకాయిలను కూడా వీలైనంత త్వరగా చెల్లిస్తామని మేము హామీ ఇస్తున్నాము.” అని మేనేజింగ్ డైరెక్ట‌ర్ తెలిపారు.

Also Read:లక్నో స్మార్ట్ సిటీని సందర్శించిన మేయర్ బృందం

- Advertisement -