రిలేషన్‌షిప్‌లో లేనప్పుడే ఆనందంగా ఉన్నా!

12
- Advertisement -

తమన్నాతో బ్రేకప్‌ పై స్పందించారు నటుడు విజయ్‌ వర్మ . లస్ట్ స్టోరీస్‌ 2 ద్వారా పరిచయమైన ఈ జంట, కొంతకాలానికే ప్రేమలో పడిపోయారు. ఇక వీరిద్దరి పెళ్లి త్వరలోనే ఉంటుందని అనుకుంటున్న సమయంలోనే విడిపోయారు.

ఈ సందర్భంగా తమన్నాతో రిలేషన్ షిప్‌పై స్పందించారు విజయ్ వర్మ. ఒక రిలేషన్‌షిప్‌ను ఐస్‌క్రీమ్‌లా ఆస్వాదించాలి… అందులో వచ్చే ప్రతి అనుభూతిని స్వీకరించాలి అన్నారు. సంతోషం, బాధ, కోపం, చిరాకు… ఇవన్నీ సహజమే… వాటిని అంగీకరించి ముందుకు సాగాలని ఆయన అన్నారు.

ఇదే సమయంలో తమన్నా కూడా ప్రేమపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రిలేషన్‌షిప్‌లో లేనప్పుడే తాను మరింత ఆనందంగా ఉన్నానని, భాగస్వామి ఎంపికలో జాగ్రత్త అవసరమని సూచించారు.

Also Read:మ్యాడ్ స్క్వేర్.. వసూళ్లు అదుర్స్!

- Advertisement -