Vijay: పార్టీ జెండా,గుర్తును ఆవిష్కరించిన విజయ్

8
- Advertisement -

తమిళ నటుడు విజయ్ తన పార్టీ జెండా, గుర్తును ఆవిష్కరించారు. ఇటీవలె తమిళగ వెట్రి కజగం పేరుతో పార్టీని ప్రకటించగా ఇవాళ చెన్నైలోని పార్టీ కార్యాలయంలో ఎరుపు, పసుపు రంగుల్లో మధ్యలో సూర్యకిరణాలు, దానికి ఇరువైపులా రెండు ఏనుగులతో ఉన్న పార్టీ జెండాను ఆయన ఎగురవేశారు. దీంతోపాటు పార్టీ గీతాన్ని కూడా విడుదల చేశారు.

ప్రజలకు అవగాహన కల్పించి అందరికీ సమాన హక్కులు, అవకాశాల కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా విజయ్ తెలిపారు. సమానత్వం అనే సూత్రాన్ని బలంగా సమర్ధిస్తామన్నారు. మన దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధులను, తమిళ నేల నుంచి వెళ్లి మన హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన అసంఖ్యాక సైనికులను ఎప్పటికీ గుర్తించుకుంటామన్నారు. కులం, మతం, లింగం, ప్రాంతం పేరుతో జరుగుతున్న వివక్షను తొలగిస్తామని చెప్పారు.

- Advertisement -