“మీకు మాత్రమే చెప్తా” అంటున్న విజయ్

592
Vijay Devarakonda Meeku Matrame Chepta
- Advertisement -

పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈమూవీ భారీ విజయాన్ని సాధించింది. ఈసినిమా తర్వాత విజయ్ స్టార్ అయిపోయాడు. పెళ్లి చూపులు సినిమాలో తనకు హీరోగా ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా ప్లాన్ చేశారు విజయ్.

ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ కొనసాగుతుంది. ఈసినిమాతో విజయ్ నిర్మాతగా మారనున్నారు. కింగ్ ఆఫ్ ది హిల్ పేరుతో ప్రొడక్షన్ ను ప్రారంభించారు. తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కుతున్న ఈసినిమాలో అనసూయ కీలక పాత్రలో నటిస్తుంది. తాజాగా తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ కలిసి ఈమూవీకి సంబంధించిన పలు విషయాలు తెలిపారు.

తాజాగా ఈసినిమా టైటిల్ పై ప్రస్తావించారు. ఈమూవీ టైటిల్ మీకు అందిరికి తెలిసిందే. చాలా కొత్తగా ఉంటుందని చెప్పారు. ఈ సినిమాపేరు మీకు మాత్రమే చెప్తా.. టైటిల్ కొత్తగా ఉంది కదా అంటూ టైటిల్ ను రివీల్ చేశాడు విజయ్ దేవరకొండ. త్వరలోనే ఈమూవీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -