విజ‌య్ సూసైడ్‌: సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు..!

209
vijay sucide video sensation
- Advertisement -

హైద‌రాబాద్‌లోని యూస‌ఫ్‌గూడ‌లోని త‌న నివాసంలో హాస్య‌న‌టుడు విజ‌య్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే విజయ్ తాను చనిపోయే కంటే ముందు సెల్ఫీ వీడియోలో సంచలనాత్మక విషయాలు వెల్లడించారు.

వాల్ పోస్ట‌ర్ అనే సినిమా ద్వారా వ‌నిత త‌న‌కు ప‌రిచ‌య‌మైందని విజ‌య్ తెలిపాడు. వ‌నిత‌కు గ‌తంలోనూ అమ్మిరెడ్డి అనే వ్య‌క్తితో పెళ్లి జ‌రిగింద‌ని చెప్పాడు. త‌మ మ‌ధ్య శ‌శిధ‌ర్ ఆనే వ్యక్తి కూడా రావ‌డంతో త‌న భార్య‌ వ‌నిత వ‌ద్ద ఆ వాతావ‌ర‌ణంలో త‌న‌ కుమార్తె పెర‌గ‌డం త‌న‌కు ఇష్టం లేదని అన్నాడు. అడ్వ‌కేట్ శ్రీనివాస్‌, శ‌శిధ‌ర్ కూడా త‌న‌ను మాన‌సికంగా వేధించారని పేర్కొన్నాడు.

అంతేకాకుండా వ్యాపార అవసరాల నిమిత్తం.. తన భార్యను కొంతమంది పారిశ్రామికవేత్తలు ఉపయోగించుకున్నారని వెల్లడించారు. ఆ విషయం తెలిసినప్పటి నుంచి తనకు, వనితకు అనేకసార్లు గొడవలు అయ్యాయని చెప్పారు. చివరకు తన కూతురు కుందనను కూడా చూడనివ్వలేదని పేర్కొన్నారు. తన భార్య, ఆమె తల్లి వ్యభిచారం చేసేవారని వారి సొంతూరుకు వెళ్తే తెలిసిందని విజయ్ వీడియోలో పేర్కొన్నారు.

- Advertisement -