హిజ్రాగా వస్తున్న విజయ్‌..

295
Vijay Sethupathi As Transgender
- Advertisement -

ఆయనో స్టార్ హీరో…. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి అగ్ర నటుడిగా వెలుగొందుతున్నాడు.. అయితే ఆ హీరో పై ఒక్కసారిగా ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది.. అదేంటంటే అతనో హిజ్రా అని.. అదేంటి స్టార్ హీరోల్లో హిజ్రా ఎవరని ఆశ్చర్య పోకండి… ఇది నిజజీవితంలో కాదు.. సినిమాల్లో… ఇంతకీ ఆ హీరో ఎవరంటే.. రొటీన్‌కు భిన్నంగా కథలను ఎంచుకుంటూ కోలీవుడ్‌లో దూసుకుపోతున్నాడు విజయ్ సేతుపతి.

కొన్ని పాత్ర‌లు చేయాలంటే చాలా గ‌ట్స్ ఉండాలి. ముఖ్యంగా నెగెటివ్ యాంగిల్‌లో ఉన్న పాత్రల‌ని చేసేందుకు స్టార్ హీరోలు రెడీ అవ్వ‌డం కాస్త డేరింగ్ అనే చెప్ప‌వ‌చ్చు. త‌మిళంలో విజ‌య్ సేతుప‌తికి చాలా క్రేజ్ ఉంది. తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా పేరు బాగా సుప‌రిచితం అయి ఉంటుంది. అయితే విజ‌య్ సేతుప‌తి త‌మిళంలో ప‌లు చిత్రాల‌లో వెరైటీ ప్ర‌యోగాలు చేశాడు.

Vijay Sethupathi As Transgender

తాజాగా సూప‌ర్ డీల‌క్స్ అనే మూవీ కోసం లేడీ గెట‌ప్ వేశాడు. రెడ్ కలర్ శారీలో.. బొట్టుపెట్టుకుని సాంప్రదాయబద్ధంగా క‌నిపిస్తున్న విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో ట్రాన్స్‌జెండ‌ర్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తుంది. ఈ పాత్ర పేరు శిల్ప కాగా, ఎక్కువ మేకప్ లేకుండా లేడీ గెటప్ లో ఈ మాస్ హీరో ఒదిగిపోయిన తీరు అందరినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. విజయ్‌ సేతుపతికి హిజ్రా మేకప్‌ వేస్తున్న ఫొటోలు విడుదల కావడంతో అవి సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

- Advertisement -