ప‌వ‌న్ టైటిల్‌తో విజ‌య్-స‌మంత‌!

123
khushi
- Advertisement -

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ – సూర్య కాంబోలో తెర‌కెక్కిన చిత్రం ఖుషి. ప‌వ‌న్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఆల్ టైం హిట్ సినిమాల్లో ఒక‌టి. తాజాగా ఇదే టైటిల్‌తో వ‌స్తున్నారు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌- స‌మంత‌.

లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమా ఇప్పటికే కశ్మీర్లో షూటింగ్ జరుపుకుంటుంది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుండ‌గా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.

ఈ సినిమాని తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడలో రిలీజ్ చేయనున్నారు. 2022, డిసెంబర్ 22న సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయ‌నున్నారు. ప‌వ‌న్ హిట్ మూవీ టైటిల్‌తో వ‌స్తున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో వేచిచూడాలి..

- Advertisement -