- Advertisement -
రూమర్స్‌కు తెరదించుతూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు టాలీవుడ్ హీరో, హీరోయిన్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా. శుక్రవారం ఉదయం విజయ్ ఇంట్లో చాలా సీక్రెట్ గా నిశ్చితార్ధం జరిగింది. దసర పండగ శుభ సందర్భంగా అత్యంత సన్నిహితుల మధ్య చాలా సింపుల్ గా ఎంగేజ్ మెంట్ వేడుక జరిగింది.
ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో వీరిద్దరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. గీత గోవిందంలో కలిసి నటించిన సమయంలోనే ఈ జంట ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పలు సినిమాల్లో కలిసి నటించారు కూడా..
అయితే వీరి ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇప్పటివరకు రివీల్ చేయలేదు. సమాచారం మాత్రం ఇచ్చారు. కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ రౌడీ హీరోగా, రష్మిక మందన్న నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందారు.
Also Read:డిసెంబర్ 5న అఖండ 2: తాండవం!
- Advertisement -

