- Advertisement -
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. ఈ జంట తమ వివాహాన్ని అధికారికంగా ప్రకటించింది. అభిమానులు ప్రేమగా పిలిచే పేరుతో దీనికి ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని నామకరణం చేశారు.
ఈ విషయాన్ని ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం, ఈ ఉదయం హైదరాబాద్ నుంచి ఉదయపూర్‌కు బయలుదేరిన ఈ జంట ఎయిర్‌పోర్ట్‌లో కలిసి కనిపించింది. సంబంధిత ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివాహ వేడుకలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రధాన పెళ్లి కార్యక్రమం ఫిబ్రవరి 26, 2026న జరగనుంది. పరిమిత అతిథులతో చాలా ప్రైవేట్‌గా ఈ వేడుక నిర్వహించనున్నట్లు సమాచారం. మార్చి 4, 2026న హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నారు.

- Advertisement -

