విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహానికి రంగం సిద్ధమైంది. ఈ జంట పెళ్లి వేడుకలు ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రుల సమక్షంలో సాదాసీదాగా వివాహం జరగనుంది. అత్యంత వ్యక్తిగతంగా, ఆత్మీయ వాతావరణంలో ఈ వేడుక నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మార్చి 4న గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసినప్పటికీ, పెళ్లి మరియు రిసెప్షన్ కార్యక్రమాలకు మీడియాకు ప్రవేశం ఉండదని తెలిసింది. ఈ రెండు కార్యక్రమాలను పూర్తిగా ప్రైవేట్‌గా ఉంచాలని జంట నిర్ణయించుకున్నట్లు వర్గాలు చెబుతున్నాయి.
అయితే, పెళ్లి అనంతరం కొద్ది రోజుల తరువాత హైదరాబాద్‌లో మీడియాతో ప్రత్యేకంగా సమావేశం కావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ సందర్భంగా నూతన దంపతులు అధికారికంగా మీడియాను కలుసుకుని ఫోటోలు పంచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read:TG:26 నుంచి అసెంబ్లీ సమావేశాలు

